హైదరాబాద్ కు మరో కొత్త పరిశ్రమ
- November 15, 2024
హైదరాబాద్: వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. ఆటోమోటివ్ సెమీకండక్టర్స్‌లో గ్లోబల్ లీడర్, టెస్లా, టాటా వంటి అగ్ర ఈవీ బ్రాండ్‌లకు కీలకమైన సరఫరాదారు అయిన అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ ఈ సెంటర్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. వచ్చే ఐదు ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పించే లక్ష్యం అన్నారు. ఇండియాలో ఎన్నో ప్రధాన నగరాలను కాదని హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
ప్రభుత్వపరంగా వారికి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇక్కడున్న ఎకో సిస్టం, స్కిల్ వర్కర్ల అవైలబిలిటీ, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో సెమీ కండక్టర్ల వినియోగం విరివిగా పెరుగుతుందన్నారు. ఆటోమేటివ్ ,ఇండస్ట్రీస్ రంగాలలో సెమీ కండక్టర్ల వినియోగంపై గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారని తెలిపారు. అలెగ్రో మైక్రో సిస్టమ్స్ మ్యాగ్నెటిక్ సెన్సార్, పవర్ ఐసి మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ లీడర్స్ అని తెలిపారు. ఈ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ తెలంగాణకు రావడం చాలా సంతోషమని తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







