దుబాయ్‌లో ప్రతిరోజు ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు..ఎక్కడ, ఎప్పుడంటే?

- November 16, 2024 , by Maagulf
దుబాయ్‌లో ప్రతిరోజు ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు..ఎక్కడ, ఎప్పుడంటే?

యూఏఈ: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF)లో భాగంగా దుకాణదారులు డిసెంబర్ 6 నుండి జనవరి 12 వరకు 38 రోజుల పాటు నగరంలో ప్రతిరోజూ రోజువారీ రివార్డ్‌లు, మెగా బహుమతులను అందజేయనున్నారు. అదే సమయంలో DSF ఫెస్టివల్ సందర్భంగా ప్రతిరోజు ఫైర్ వర్క్స్ నిర్వహిస్తుంది. 38 రోజులపాటు DSFలో ఫ్రీగా ఈ ప్రదర్శనలను చూడవచ్చు.  అలాగే డ్రోన్ షోలు, లైవ్ కాన్సర్ట్ లు మరపురాని అనుభూతిని అందిస్తుంది.

దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్
-ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ (DFCM)లో అల్ జరూనీ గ్రూప్ ద్వారా ఉచితంగా ఫైర్ వర్క్స్ ప్రదర్శనలను ఆస్వాదించవచ్చు.  రెండు సరికొత్త ఐకానిక్ ఇమాజిన్ DSF ఎడిషన్ షోలు నిర్వహిస్తున్నారు. మాయా దుబాయ్ కౌకబ్ అఖిర్,  యా సలామ్ యా దుబాయ్ పేర్లతో ఉన్న వీటిని ప్రతిరోజూ సాయంత్రం 6.30 మరియు 8.30 గంటలకు ప్రదర్శిస్తారు. దీంతోపాటు వారానికి ఐదుసార్లు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించబడే మిస్సబుల్ రాఫిల్ డ్రాలు ఉంటాయి.

హట్టా  
ప్రఖ్యాత హట్టాలో ఫైర్ వర్క్స్ ని కుటుంబంతో సహా ఎంజాయ్ చేయవచ్చు. లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ ప్రాంతాన్ని వండర్‌ల్యాండ్‌గా మారుస్తుంది. సందర్శకులు ఆర్టిసానల్ కాఫీలను ఆస్వాదించవచ్చు. లైవ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. 

డ్రోన్ ప్రదర్శనలు
బ్లూవాటర్స్ ద్వీపం, ది బీచ్, JBR వద్ద ప్రతిరోజూ రెండుసార్లు నిర్వహిచే డ్రోన్ ప్రదర్శనలను , ఉచితంగా చూడవచ్చు. 1,000 డ్రోన్‌లు ప్రతి రాత్రి 8pm , 10pmలకు రెండు ఆకర్షణీయమైన ప్రదర్శనలు సందర్శకులను కట్టిపడేస్తాయి. ఫస్ట్ థీమ్ లో భాగంగా డిసెంబర్ 6 నుండి 26 వరకు విజువల్స్, ఎపిక్ డ్రోన్ ఫార్మేషన్‌లను కలిగి ఉన్న మూడు దశాబ్దాల మరపురాని వీక్షకులను అందజేస్తుంది.  రెండవ థీమ్ డిసెంబర్ 27 నుండి జనవరి 12 వరకు ఫవర్ పుల్ బీట్‌లు, వినూత్న సౌండ్ ఎఫెక్ట్‌లతో ప్రత్యేకంగా నిలుస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com