UAE భారతీయ కమ్యూనిటీతో కలిసి దీపావళిని జరుపుకున్న నహ్యాన్ బిన్ ముబారక్

- November 17, 2024 , by Maagulf
UAE భారతీయ కమ్యూనిటీతో కలిసి దీపావళిని జరుపుకున్న నహ్యాన్ బిన్ ముబారక్

యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని భారతీయ కమ్యూనిటీ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలకు యూఏఈ మంత్రి నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు భారత రాయబారి సుంజయ్ సుధీర్ మరియు ఇతర ప్రముఖులు  పాల్గొన్నారు. దుబాయ్ లోని జబీల్ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 60,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం మరియు దుబాయ్ పోలీస్ ఈ కార్యక్రమానికి మద్దతు అందించిన ఈ కార్యక్రమం “ఎమిరేట్స్ లవ్స్ ఇండియా” అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ వేడుకలో భారతీయ సాంస్కృతిక వారసత్వం, కళలు, సంగీతం, మరియు ఫోక్‌లోర్ ప్రదర్శనలు కనువిందు చేశాయి.

ఈ సందర్భంగా నహ్యాన్ బిన్ ముబారక్ మాట్లాడుతూ ఈ వేడుకల ద్వారా యూఏఈ మరియు భారతదేశం మధ్య ఉన్న స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన దీపావళి పండుగను విశిష్టత తెలియజేస్తూ “అంధకారంపై వెలుగుల విజయం, అజ్ఞానంపై జ్ఞాన విజయం, చెడుపై మంచి విజయం, మరియు సంఘర్షణపై శాంతి విజయం” గా వర్ణించారు. 

ఈ వేడుకలో భారతీయ సమాజానికి చెందిన ప్రముఖులను ఆయన సత్కరించారు. వీరిలో డాక్టర్ సురేందర్ సింగ్ కంద్హారి, నిషా జాగ్టియాని, సిద్ధార్థ్ బాలచంద్రన్, రిజ్వాన్ సజాన్, మరియు అతిఫ్ రహ్మాన్ ఉన్నారు. ఈ కార్యక్రమం భారతీయ సమాజం మరియు యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రతిబింబించింది.ఈ విధంగా, యూఏఈ లోని భారతీయ కమ్యూనిటీ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవడం ద్వారా తమ సాంస్కృతిక వారసత్వాన్ని మరియు యూఏఈ తో ఉన్న స్నేహ సంబంధాలను మరింత బలపరిచింది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com