డ్రైవర్ నిర్లక్ష్యం..సముద్రంలో పడిన వెహికల్..!!
- November 20, 2024
దుబాయ్: వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు డ్రైవర్ సరైన భద్రతా చర్యలను పాటించకపోవడం వల్ల అల్ హమ్రియా ప్రాంతంలో ఓ వాహనం సముద్రంలో పడిపోయింది. దుబాయ్ పోర్ట్స్ పోలీస్ స్టేషన్‌లోని మారిటైమ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ సిబ్బంది అతికష్టం మీద కార్గో వాహనాన్ని స్వాధీనం వెలికితీశారు. పోర్ట్స్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అలీ అబ్దుల్లా అల్ ఖుసిబ్ అల్ నక్బీ మాట్లాడుతూ.. డ్రైవర్ నిర్లక్ష్యంతో స్నేహితులతో మాట్లాడుతూ వాహనాన్ని వదిలి వెళ్లాడని, దీంతో వాహనం కదిలి వార్ఫ్‌పై పడిపోయిందని వివరించారు. వాహన హ్యాండ్‌బ్రేక్‌ను సరిగ్గా ఉపయోగించలేదని అల్ నక్బీ పేర్కొన్నాడు.దీంతో పుచ్చకాయలు తీసుకెళ్తున్న వాహనం సముద్రంలో పడిపోయిందని, అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. డ్రైవర్లు తమ వాహనాలను పార్కింగ్ చేసేటప్పుడు అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జనరల్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను 999 నంబర్‌కు లేదా అత్యవసర పరిస్థితుల కోసం 901 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







