మదీనాలో ట్రాఫిక్ ప్రమాదాలకు ‘సెల్ఫోన్ డ్రైవింగ్’ ప్రధాన కారణమా?

- November 21, 2024 , by Maagulf
మదీనాలో ట్రాఫిక్ ప్రమాదాలకు ‘సెల్ఫోన్ డ్రైవింగ్’ ప్రధాన కారణమా?

రియాద్:  2023లో మదీనా ప్రాంతంలో ట్రాఫిక్ ప్రమాదాలకు మూడు ప్రధాన కారణాలను గుర్తించినట్టు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. డిపార్ట్‌మెంట్ ప్రకారం, వాహనాలను నడుపుతున్నప్పుడు హ్యాండ్‌హెల్డ్ మొబైల్ పరికరాలను ఉపయోగించడం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రధాన కారణమని గుర్తించారు. ఆ తర్వాత ఆకస్మిక రహదారి లేన్ మార్పులు,  వాహనాల మధ్య సురక్షితమైన దూరాన్ని నిర్వహించడంలో విఫలం కావడం వంటి కారణాలు ఉన్నాయని తెలిపారు. ట్రాఫిక్ చట్టాలు,  రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని కింగ్‌డమ్‌లోని వాహనదారులందరినీ డిపార్ట్‌మెంట్ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com