మరోసారి రెఫరెండం కోసం డిమాండ్‌..

- June 25, 2016 , by Maagulf
మరోసారి రెఫరెండం కోసం డిమాండ్‌..

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలు ప్రాంతాలకు చెందిన ఆ దేశ వాసులు రెండో రెఫరెండం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇందు కోసం ఓ వెబ్‌సైట్‌లో పెట్టిన పిటిషన్‌పై సంతకాలు చేసిన వారి సంఖ్య ఒక మిలియన్‌ దాటింది. సంతకాలు చేసిన వారిలో ఎక్కువగా లండన్‌, బ్రిగ్టన్‌, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, మాంచెస్టర్‌ నుంచి ఉన్నారు. వీరంతా బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినవారే.
ఒక మిలియన్‌ సంతకాలు చేసిన ఈ పిటిషన్‌ బ్రిటిష్‌ పార్లమెంట్‌లో చర్చకు రానుంది. హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో దీనిపై చర్చించనున్నారు. ఈ పిటిషన్‌ను ప్రారంభించిన విలియన్‌ ఒలివర్‌ మాట్లాడుతూ' మొత్తం 75 శాతం కంటే తక్కువగా నమోదైన ఓటింగ్‌లో ఈయూ నుంచి వైదొలగడం లేదా కొనసాగడం 60 శాతం కంటే తక్కువ ఉందని.. ఈ నేపథ్యంలో రెండో రిఫరెండాన్ని నిర్వహించి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
ఎక్కువ సంఖ్యలో ప్రజలు రెండో రెఫరెండం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ పిటిషన్‌ కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ ఓ దశలో స్తంభించిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com