సమాచారం దాచిపెట్టిన కంపెనీ..కంపెనీ డైరెక్టర్కు Dh118,500 ఫైన్..!!
- November 23, 2024
యూఏఈ: కంపెనీకి సంబంధించిన తప్పుడు సమాచారం అందించడం, అధికారిక పత్రాలను దాచడం వంటి వివిధ ఉల్లంఘనలకు అబుదాబి ఫ్రీ జోన్లోని ఒక కంపెనీకి మొత్తం $32,000 (Dh118,500) జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన Avante Limited (Avante) డైరెక్టర్ ఖల్దూన్ బుష్నాక్పై అబుదాబి గ్లోబల్ మార్కెట్ (ADGM) రిజిస్ట్రేషన్ అథారిటీ (RA) జరిమానా విధించింది. అవంటేపై $16,000 (Dh58,700) పెనాల్టీ విధించగా, బుష్నాక్కి మరో $16,300 (Dh59,800) విధించారు. అవాంటే అథారిటీ విచారణ ఖర్చుల కోసం అదనంగా $10,000 (Dh36,700) చెల్లించాలని అధికారులు తెలిపారు. యూఏఈ బేస్డ్ బ్యాంకుకు కంపెనీ రిజిస్ట్రేషన్ అథారిటీ జారీ చేసినట్టు తెలిపే ఫేక్ డ్యాక్యుమెంట్ ను సమర్పించిందని, విచారణ సమయంలో తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించిందని బుష్నాక్ పత్రాలను దాచిపెట్టాడని నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







