ఇంజిన్, సౌండ్ సిస్టమ్ లో మార్పులు..12వేల వాహనాలకు జరిమానాలు..!!

- November 23, 2024 , by Maagulf
ఇంజిన్, సౌండ్ సిస్టమ్ లో మార్పులు..12వేల వాహనాలకు జరిమానాలు..!!

యూఏఈ: అధిక శబ్దాలు, ఇంజిన్ లో మార్పులు చేసినందుకు ఈ ఏడాది జనవరి నుండి 12వేల మంది వాహన యజమానులకు దుబాయ్ పోలీసులు జరిమానా విధించారు.  అనుమతి లేకుండా వాహనం ఇంజిన్ లేదా ఛాసిస్‌లో గణనీయమైన మార్పులు చేయడం ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. సౌండ్, ఇంజిన్ మార్పులు చేసిన వాహనాలను నడపడం తీవ్రమైన ట్రాఫిక్ నేరమని, 2,000 దిర్హామ్‌ల ట్రాఫిక్ జరిమానాతోపాటు 12 బ్లాక్ పాయింట్‌లు విధిస్తామని దుబాయ్ పోలీసులు తెలిపారు. అలాగే జప్తు చేయబడిన కార్లను విడుదల చేయడానికి 10,000 దిర్హామ్‌ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.  దుబాయ్ పోలీస్‌లోని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి.. "ఇంజిన్ వేగాన్ని పెంచే సాంకేతికతలను ఉపయోగించవద్దని, ఇవి నివాస ప్రాంతాల నివాసితులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి." అని హెచ్చరించారు.  దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్న "పోలీస్ ఐ" లేదా "వి ఆర్ ఆల్ పోలీస్" , 901కి కాల్ చేయడం ద్వారా నివేదించాలని ఆయన ప్రజలను కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com