టాక్సిక్ ఎయిర్ నుంచి లంగ్స్ ను కాపాడే 6 డ్రింక్స్

- November 24, 2024 , by Maagulf
టాక్సిక్ ఎయిర్ నుంచి లంగ్స్ ను కాపాడే 6 డ్రింక్స్

ఢిల్లీ, హైదరబాద్ వంటి నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం 10 రెట్లు పెరిగింది. పిల్లలు, వృద్ధులు కాలుష్యం వల్ల త్వరగా ఎఫెక్ట్ అవుతారు. వేగంగా పెరుగుతున్న కాలుష్యం ప్రజలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా కాలుష్యం వల్ల కళ్లు మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడం సాయపడే కొన్ని డ్రింక్స్ ఆహారంలో భాగమవ్వాలి. ఈ సూపర్ డ్రింక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాయు కాలుష్యం నుంచి ఊపిరితిత్తుల్ని కాపాడటమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆ సూపర్ డ్రింక్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

1.  గ్రీన్ టీ :

 గ్రీన్ టీలో కాటెచిన్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది మన ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచడంలో కూడా గ్రీన్ టీ బెస్ట్ ఆప్షన్. ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యాన్ని నివారించడానికి గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి.

2. తులసి నీరు:

తులసి ఆకులు అనేక వ్యాధులతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఈ నీరు పిల్లలు, వృద్ధులు కూడా తాగవచ్చు.

3. పసుపు పాలు

శరీరంలోని అంతర్గత భాగాలలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడంలో పసుపు సహాయపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఊపిరితిత్తులు దృఢంగా మారుతాయి. అదనంగా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దగ్గు, జలుబు ఉన్నవారు పసుపు పాలు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

4. బీట్‌రూట్ జ్యూస్

రక్తహీనత ఉన్నవారు బీట్‌రూట్ తినడం మంచిది. ఇది రక్తహీనతను దూరం చేయడమే కాకుండా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక, బీట్‌రూట్ జ్యూస్ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో లంగ్స్ హెల్త్ మెరగవుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడతాయి. అందుకే కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే బీట్‌రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు.

5. అలోవెరా జ్యూస్

అలోవెరా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. వాయు కాలుష్యం ప్రభావం నుంచి ఊపిరితిత్తులను రక్షించడానికి కలబంద రసాన్ని ప్రతిరోజూ తాగవచ్చు.

6. ఉసిరి జ్యూస్

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఉసిరి జ్యూస్ హానికరమైన కాలుష్య కారకాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. లంగ్స్ పనితీరు మెరగవుతుంది. ఉసిరి రసం పిల్లలకు, వృద్ధులకు చాలా మేలు చేస్తుంది. ఉసిరి రసం తాగడం వల్ల జుట్టు, చర్మ ఆరోగ్యం కూడా మెరగవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com