'మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డు' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
- November 24, 2024
హైదరాబాద్: ’12 ఏళ్ల క్రితం నాకు హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలితే కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి డాక్టర్ నేను బతకడం కష్టమని చెప్పారు. కానీ ఇక్కడున్న డాక్టర్ శరత్ నాకు ప్రోణం పోశారు.మళ్లీ పునర్జన్మ ఇచ్చారు.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు.ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని సైబర్ గేట్ వద్దనున్న మెడికోవర్ ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రి ఆసుపత్రి యాజమాన్యం నూతనంగా ప్రవేశపెట్టిన ‘మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డు’ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు డాక్టర్ అనిల్ క్రిష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ క్రిష్ణ ప్రసాద్, హరిక్రిష్ణ, బుల్లితెర హీరో శ్రీరాం హాజరయ్యారు.బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘యూరప్ లో పాపులర్ ఆసుపత్రి మెడికోవర్.నాకు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ శరత్ రెడ్డితో సన్నిహిత సంబంధముంది.నేను ఆయన పేషెంట్ నే.ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం డాక్టర్ శరత్, డాక్టర్ సాహు కారణం. 2012లో కరీంనగర్ లో ర్యాలీ చేస్తుంటే హార్ట్ స్ర్టోక్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకొస్తే మీ అబ్బాయి బతకడం కష్టం, ఇంటికి తీసుకెళ్లండని డాక్టర్లు మా అమ్మకు చెప్పారు.అప్పుడు మా సిస్టర్ డాక్టర్ సౌమ్య డాక్టర్ శరత్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది.వెంటనే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాహుతో మాట్లాడారు. 3, 4 గంటలపాటు కష్టపడి నన్ను బతికించారు.ఇది నాకు పునర్జన్మ. దీనికి కారణం డాక్టర్ శరత్, డాక్టర్ సాహుయే. మెడికోవర్ ఆసుపత్రి వైద్యుల సేవల భేష్. భారత్ లోని 16 నగరాల్లో 23 ఆసుపత్రులున్నయ్. 1200 మంది డాక్టర్లు, 13 వేల మంది ఉద్యోగులున్న ఈ ఆసుపత్రిలో కోటి మందికిపైగా రోగులకు ఇప్పటి వరకు వైద్య సేవలందించడం గొప్ప విషయం.
దురద్రుష్టమేందంటే చాలా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నరు. ఎందుకంటే ఆసుపత్రి బిల్లులు భరించలేనంతగా ఉన్నాయి.తొలుత ఆసుపత్రిలో చేరినప్పుడు ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చయితదని చెబుతారో...డిశ్చార్జ్ అయ్యే నాటికి అంతకు ఐదారు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు.ఈరోజు కూడా నా దగ్గరకు నాకు తెలిసిన వ్యక్తి వచ్చి ఫలానా ఆసుపత్రిలో మా అమ్మను చేర్పించాను. తొలుత రూ.3 లక్షల ఖర్చయతదని చెప్పి... ఇప్పుడు 16 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. నెల జీతంపై బతికే నేను అంత కట్టలేను. మా అమ్మను డిశ్చార్జ్ చేయించండి. చనిపోయినా ఫరవాలేదని ఏడుస్తూ చెప్పాడు...
ఆసుపత్రులంటే భయపడే పరిస్థితి ఉన్న ఈరోజుల్లో భయం వద్దు... ఆసుపత్రి అంటే భరోసా కల్పించేలా ‘మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డు’ను మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రవేశపెట్టడం గొప్ప విషయం. ఈ కార్డు తీసుకున్న కుటుంబ సభ్యులందరికీ 15 నుండి 50 శాతం వరకు ఆసుపత్రి బిల్లులో డిస్కౌంట్ ఇస్తుండటం శుభపరిణామం. ఆసుపత్రికి భారమైనప్పటికీ రోగులను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా.
ఆసుపత్రి సీఎండీ, డైరెక్టర్ డాక్టర్ అనిల్ క్రిష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ... సామాన్య కుటుంబం నుండి వచ్చిన బండి సంజయ్ కష్టపడి పైకొచ్చిన నాయకుడు.మాస్ లీడర్. అన్నింటికంటే గొప్ప మానవతావాది.మా ఆసుపత్రిలో చాలా మంది పేషెంట్లకు తనే మొత్తం బిల్లు చెల్లించి వైద్యం చేయించారు.ఎంతో మందికి సాయం చేసే వ్యక్తి. తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా సాయపడాలనే తపన కలిగిన వ్యక్తి బండి సంజయ్.ఆయన చేతుల మీదుగా ‘మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డు’ను ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







