చైనీస్ రోస్ చికెన్

- June 25, 2016 , by Maagulf
చైనీస్ రోస్ చికెన్

 

చికెన్ రెక్క పైన భాగము - 1

కార్న్ ఫ్లౌర్

మైదా

చిల్లి సాస్

సోయ్ సాస్

కోడి గ్రుడ్డు

ధనియాల పొడి

అజినోమోటో

కారం

వైట్ పెప్పర్

ఉప్పు

కలర్

నూనె

1 ముందుగ కోడి గ్రుడ్డు ని గిలకొట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

ఇప్పుడు 2 tablespoons కార్న్ ఫ్లోర్ , 1 tablespoon మైదా, 1 teaspoon చిల్లి సాస్, అర teaspoon సోయ్ సాస్, చిటికెడు అజినోమోటో, తగినంత కారం, ఉప్పు, చిటికెడు కలర్ , 1 తెఅస్పూన్ ధనియాల పొడి, 1 తెఅస్పూన్ వైట్ పెప్పర్  వేసుకోవాలి.

వీటన్నిటిని కోడి గ్రుడ్డు తో పేస్టు లాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.


2  ఇప్పుడు కోడి రెక్క పై భాగము తీసుకొని దానిని పైన నుండి కిందకు కండను చెక్కుకుంటూ రావాలి.

రోస్ ఆకారం లాగ చేయాలి.

ఘాట్లు పెట్టి చేసుకున్న పేస్టు లొ ముంచి మొత్తం అయ్యేలాగా చేసుకుని 4 - 5 గంటలు పాటు నాన పెట్టాలి.


3 ఇప్పుడు ఒక బాండలి లొ deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.

ఇప్పుడు బోనే ని పట్టుకొని కింద భాగం ను మొదట నూనె లొ వదలాలి.

ఒక రెండు నిముషాలు తరువాత మొత్తం ముక్కను నూనె లొ వదిలేయాలి.

మొత్తం ఉడికాక ఒక చిల్లెల్ల గిన్నెలోకి తీసుకొని పెప్పర్ పొడి చల్లుకొని వేడి వేడి గా తింటే ఎంతో రుచి గా ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com