రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
- November 26, 2024
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతి పెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురవుతాయి. దీంతో శరీర కణాలకు శక్తి అందక అలసటగా అనిపిస్తుంది. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే, జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. అయితే జీవన శైలి మార్పులు, చిన్నపాటి ఆహారపు అలవాట్లు పాటిస్తే వ్యాధి సోకే ముప్పు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ప్రారంభంలో లక్షణాలు చాలా తేలికపాటివి. వీటిని చాలా మంది గుర్తించలేరు. డయాబెటిస్ పెరిగినప్పుడు మాత్రమే గుర్తిస్తారు. సాధారణంగా మధుమేహం లక్షణాలు తెలియవు. అయితే రాత్రి నిద్రిస్తున్నప్పుడు మధుమేహానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయని మీకు తెలుసా? ఈ లక్షణాల్ని సరైన సమయంలో గుర్తిస్తే వాటిని కంట్రోల్ చేయవచ్చంటున్నారు నిపుణులు. ఆ లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. నిద్రించే సమయంలో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. దీంతో హార్మోన్ స్థాయిలు మారుతూ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నప్పుడు శరీరానికి సరైన మోతాదులో ఇన్సులిన్ అందదు. దీంతో రాత్రిపూట రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగడానికి లేదా తగ్గడానికి ఇది కారణమవుతుంది. దీంతో లక్షణాలు కపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలేంటో ఓ లుక్కేద్దాం.
2. అధిక రక్తంలో చక్కెర స్థాయిల కారణంగా, కణాలు తగినంత శక్తిని పొందవు. దీంతో శరీరం అంతటా అలసట, బలహీనమైన అనుభూతికి దారితీస్తుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా ఉదయం అలసటగా అనిపించడం డయాబెటిస్ లక్షణం అంటున్నారు నిపుణులు.
3. తరచుగా మూత్రవిసర్జన కారణంగా.. శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీంతో.. అధిక దాహం వేస్తుంది. ఇలాంటి వాళ్లు రాత్రి పూట నీళ్లు పదే పదే తాగుతారు. ఈ లక్షణం కూడా డయాబెటిస్‌ను సూచిస్తుంది.
4. డయాబెటిస్ ఉన్నప్పుడు శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా మార్చదు. దీని కారణంగా, శరీరం శక్తి కోసం కొవ్వును బర్న్ చేస్తుంది. దీంతో అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. ఇది కూడా డయాబెటిస్ ఒక లక్షణం.
5. తక్కువ రక్త చక్కెర స్థాయిలు (హైపోగ్లైసీమియా) రాత్రి చెమటలకు కారణమవుతాయి. వణుకు, వేగవంతమైన హృదయ స్పందన, భ్రాంతి వంటి ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు.
6. తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల, నోటిలో లాలాజలం తగ్గుతుంది. దీని కారణంగా నోరు పొడిగా మారుతుంది. ఇది కూడా డయాబెటిస్ లక్షణం అంటున్నారు. ఇలా రాత్రి పూట జరిగితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
7. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కంటి చూపు మందగిస్తుంది. షుగర్ లెవల్స్ కంటి లెన్స్, రెటీనాను దెబ్బతీస్తాయి. దీంతో.. అస్పష్టమైన దృష్టి వంటి సమస్యలు వస్తాయి.
8. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే చర్మంపై దురద కలుగుతుంది. పాదాలు, చేతులపై ఇలాంటి దురద లక్షణాలు కన్పించడం మంచిది కాదు. ఇది కూడా డయాబెటిస్‌కి సంకేతం.
9. అధిక రక్త చక్కెర స్థాయిలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. దీంతో తరచుగా ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇది కూడా డయాబెటిస్ లక్షణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.
10. అధిక రక్త చక్కెర స్థాయిలు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయియ దీని కారణంగా గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి. ఇది కూడా డయాబెటిస్ లక్షణం.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!