GCC డ్రైవింగ్ లైసెన్స్ UAEకి మార్చడం సాధ్యమేనా?

- November 26, 2024 , by Maagulf
GCC డ్రైవింగ్ లైసెన్స్ UAEకి మార్చడం సాధ్యమేనా?

యూఏఈ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుండి యూఏఈకి మారినట్లయితే జిసిసి దేశాల్లో పొందిన డ్రైవింగ్ లైసెన్స్‌ను యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌గా ఈజీగా మార్చుకోవచ్చు.మీరు సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, కతార్ లేదా ఒమన్ వంటి GCC దేశాల నుండి UAEకి మారితే మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను UAE డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చు.ఇందు కోసం జీసీసీ దేశాల పౌరులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి రోడ్ టెస్ట్ తీసుకోవలసిన అవసరం లేదు.ఇతర దేశాల పౌరులు UAE డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలంటే వారు రోడ్ టెస్ట్ తీసుకోవలసిన అవసరం ఉంటుంది.ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది మరియు అదనపు డ్రైవింగ్ పరీక్షలు లేకుండా చేయవచ్చు. 

సాధారణంగా UAEలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఒక రిజిస్టర్డ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్‌లో డ్రైవింగ్ క్లాసులు తీసుకోవాలి మరియు అన్ని పరీక్షలను ఉత్తీర్ణత సాధించాలి.ఈ పరీక్షలు సాధారణంగా థియరీ టెస్ట్, పార్కింగ్ టెస్ట్ మరియు రోడ్ టెస్ట్‌లను కలిగి ఉంటాయి.వీటితో పాటు పాస్‌పోర్ట్, రెసిడెన్స్ వీసా పేజీ, ఎమిరేట్స్ ఐడి, రెండు ఫోటోలు, మరియు ఒక ఆమోదిత సెంటర్ నుండి ఐ టెస్ట్ రిపోర్ట్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, మీ స్పాన్సర్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కూడా అవసరం కావచ్చు. ఈ విధంగా, మీరు UAEలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన అన్ని దశలను పూర్తి చేసి, డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

ఉదాహరణకు మీరు UAE సందర్శించినప్పుడు సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్ మరియు ఒమన్‌లలో జారీ చేయబడిన లైసెన్స్‌లు యూఏఈ లో ఆమోదించబడినందున మీరు మీ GCC డ్రైవింగ్ లైసెన్స్‌ని ఉపయోగించి దేశంలో సులభంగా డ్రైవ్ చేయవచ్చు. కాబట్టి, మీరు UAE సందర్శనలో ఉన్నప్పుడు కారును అద్దెకు తీసుకుంటే, మీ GCC డ్రైవింగ్ లైసెన్స్ యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌గా ఆమోదించబడుతుంది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com