BAPS హిందూ మందిర్‌లో ఐజీఎఫ్ ఐక్యత వేడుకలు..!!
- November 27, 2024
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్‌లో IGF ఐక్యత వేడుకలను నిర్వహించారు. "లిమిట్లెస్ హారిజన్స్" అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా నుంచి 200 మంది స్పీకర్లు, 1,000 మంది ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నెట్వర్కింగ్ అవకాశాలు, గ్లోబల్ పార్టనర్‌షిప్‌లు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి తొమ్మిది స్ట్రీమ్‌లలో స్పూర్తిదాయకమైన కీనోట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తోపాటు BAPS హిందూ మందిర్ పూజ్య బ్రహ్మవిహారి స్వామిజీ హాజరయ్యారు. పరస్పర విశ్వాసం, సామరస్యం ద్వారా ఏమి సాధించవచ్చో ఈ మందిరం ఒక ఉదాహరణ అని పూజ్య బ్రహ్మవిహారి స్వామి అన్నారు. పరమపూజ్య ప్రముఖ్ స్వామి మహారాజ్ ప్రార్థనల ప్రేరణ, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దాతృత్వం ద్వారా మందిరం కల సాకారమైందన్నారు.
యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించారు. యూఏఈలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో బాప్స్ హిందూ మందిర్ ఒకటిని తెలిపారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షల నుండి మందిరం రూపుదిద్దుకుందన్నారు. ఇండియా-యూఏఈ సంబంధాలకు మందిరం పునాది అని ఐజీఎఫ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మనోజ్ లాడ్వా అన్నారు. మందిర్ మానవత్వం, ప్రకృతి మధ్య సామరస్యాన్ని సూచిస్తుందన్నారు.
హెల్త్, లీడర్షిప్ క్వాలిటిస్, కమ్యూనిటీ శ్రేయస్సుపై అర్ధవంతమైన చర్చలు జరిగాయని తులా వ్యవస్థాపకుడు ఫైసల్ కొట్టికొల్లన్, సాంస్కృతిక నాయకత్వ నిపుణుడు సుహెల్ సేథ్, టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ తెలిపారు. ప్రాచీన వెల్నెస్ పద్ధతులను పునఃసమీక్షించవలసిన సమయం వచ్చిందని ఫైసల్ కొట్టికొల్లన్ అన్నారు.ఆధునిక వైద్యం వ్యాధులను ఒంటరిగా చూస్తుందని, కానీ మనం శరీరం, మనస్సు ఆత్మల కలయిక అని, ఆయుర్వేదం సంపూర్ణ ఆరోగ్యానికి మార్గాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. వెల్నెస్ అడ్వొకసీలో ఆధ్యాత్మికత పాత్రను సుహెల్ సేథ్ వివరించారు. మంచి ఆరోగ్యం మంచి ఆత్మతో మొదలవుతుందన్నారు. బిఏపిఎస్ మందిర్ హిందూ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని, నేటి ప్రపంచంలో ఆధ్యాత్మిక స్వస్థత ఒయాసిస్‌గా పనిచేస్తుందన్నారు.లియాండర్ పేస్ మాట్లాడుతూ.. క్రీడల ద్వారా మిలియన్ల మంది పిల్లలను ప్రేరేపించడం తన కల అని వివరించారు.




తాజా వార్తలు
- ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్‌లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్‌లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









