సోకా ప్రపంచకప్ తొలిమ్యాచ్ లో ఇటలీతో తలపడనున్న ఒమాన్

- November 29, 2024 , by Maagulf
సోకా ప్రపంచకప్ తొలిమ్యాచ్ లో ఇటలీతో తలపడనున్న ఒమాన్

మస్కట్: సోకా ప్రపంచ ఫుట్ బాల్ కప్ 2024లో భాగంగా ఇటలీ తమ తొలి మ్యాచ్‌లో ఒమాన్‌తో తలపడనుంది. గ్రూప్ A లో ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ ఫుట్ బాల్ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్లోని స్పోర్ట్స్ మేకర్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు (ఒమన్ కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. సిక్స్-ఎ-సైడ్ ఫుట్బాల్ ఈవెంట్ ప్రారంభ వేడుక హిస్ హైనెస్ సయ్యద్ నాదిర్ బిన్ అల్ జులాందా అల్ సైద్ ఆధ్వర్యంలో అధికారులు మరియు ప్రముఖుల సమక్షంలో జరగనుంది.

ఇటలీ జట్టు తమ సుదీర్ఘ ఫుట్ బాల్ చరిత్రలో ఎన్నో విజయాలను సాధించింది.ఈ మ్యాచ్‌లో కూడా వారు తమ ప్రతిభతో గెలుస్తామని ఆశిస్తున్నారు.ఇటలీ జట్టు, తమ స్ట్రాంగ్ డిఫెన్స్ మరియు అటాకింగ్ స్ట్రాటజీలతో ప్రసిద్ధి చెందింది.ఈ మ్యాచ్‌లో వారు తమ అనుభవాన్ని ఉపయోగించి ఒమాన్ జట్టును ఎదుర్కొనాలని చూస్తున్నారు. మరోవైపు, ఒమాన్ జట్టు కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ మ్యాచ్ నవంబర్ 30, 2024న జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటలీ జట్టు ప్రధాన ఆటగాళ్లు, వారి ఫార్మ్ మరియు ఫిట్‌నెస్‌పై ఆధారపడి, ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు. ఒమాన్ జట్టు కూడా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి, ఇటలీకి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

సోకా ప్రపంచ ఫుట్ బాల్ కప్ 2024 టోర్నమెంట్‌లో 40 జట్లు పాల్గొనగా ఎనిమిది గ్రూపులుగా విభజించబడ్డాయి, ప్రతి గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లు మరియు వారి గ్రూపులు:

గ్రూప్ 1: US, ఇటలీ, కెనడా, కతార్, ఒమాన్.

గ్రూప్ 2: జర్మనీ, బల్గేరియా, జార్జియా, లిబియా, సెర్బియా.

గ్రూప్ 3: గ్రీస్, బెల్జియం, సైప్రస్, కువైట్, ఇరాక్.

గ్రూప్ 4: బ్రెజిల్, ఈజిప్ట్, ఐర్లాండ్, కొలంబియా, ఇరాన్.

గ్రూప్ 5: పోలాండ్, ఫ్రాన్స్, టర్కీ, పాకిస్తాన్, హైటి.

గ్రూప్ 6: మెక్సికో, లాట్వియా, అల్బేనియా, పెరూ, ఆస్ట్రేలియా.

గ్రూప్ 7: కజకిస్తాన్, ఇంగ్లాండ్, రొమేనియా, ఉరుగ్వే, సూడాన్.

గ్రూప్ 8: క్రొయేషియా, హంగేరీ, అర్జెంటీనా, ట్యునీషియా, దక్షిణాఫ్రికా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com