తెలంగాణ: రామప్ప, సోమశిల అభివృద్ధికి కేంద్రం ముందడుగు

- November 29, 2024 , by Maagulf
తెలంగాణ: రామప్ప, సోమశిల అభివృద్ధికి కేంద్రం ముందడుగు

వరంగల్: భారత పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా.. ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 50 ఏళ్ల కాలవ్యవధితో రూ.3,295.76 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు.

సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్ కింద రూ.74 కోట్లతో రామప్ప ఏరియా, వెల్ నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల కింద రూ.68 కోట్లతో సోమశిల ఏరియాను అభివృద్ధి చేయనున్నారు.

ప్రజల ఆదరణ పొందిన ఆయా పర్యాటక ప్రాంతాలలో రద్దీని తగ్గించడం, అధునాతన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వరకు, భారతదేశ సహజమైన సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి అనేక రకాల చర్యలను చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com