అలెర్ట్..AI కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనల రికార్డ్..!!
- November 30, 2024
కువైట్: ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ AI కెమెరాల అమలును ప్రారంభించింది. ఏఐను ఉపయోగించి ఆటోమేటిక్ నిఘా కెమెరాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, రహదారిపై ఉల్లంఘనలను రికార్డ్ చేయడం ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఉల్లంఘనలు, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిరోధించేందుకు పర్యవేక్షించడానికి AI కెమెరాలు ఉపయోగించబడతాయని తెలిపింది. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించాలని, రహదారిపై ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా ఉండాలని మంత్రిత్వ శాఖ డ్రైవర్లందరికీ పిలుపునిచ్చింది. ఇటీవల కువైట్ మంత్రివర్గం కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఆమోదించింది. ఇది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..