తృణధాన్యాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్.. 15 ఏళ్ల జైలు, BD 5,000 ఫైన్..!!
- November 30, 2024
మనామా: తృణధాన్యాల పెట్టెల్లో డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మొదటి హై క్రిమినల్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష, BD 5,000 జరిమానా విధించింది. అరబ్ దేశం నుంచి వచ్చిన వ్యక్తి అనుమానాస్పద ప్రవర్తనపై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. ఆ వ్యక్తి సామానులో 101 గ్రాముల గంజాయి, తృణధాన్యాల పెట్టెల్లో దాచిన 1,975 క్యాప్‌గాన్ మాత్రలు, 1,000కి పైగా సైకోట్రోపిక్ మాత్రలను గుర్తించినట్టు యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అలాగే అతడు ఇచ్చిన సమాచారంతో అతని ఇంటిపై రైడ్ చేసి 34.47 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్‌లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్‌పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా