స్పెషల్ ఆపరేషన్.. 100,000 బిడి విలువైన మాదకద్రవ్యాలు సీజ్..!!

- December 02, 2024 , by Maagulf
స్పెషల్ ఆపరేషన్.. 100,000 బిడి విలువైన మాదకద్రవ్యాలు సీజ్..!!

మనామా: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ 7 కిలోగ్రాముల మత్తుపదార్థాలు, సైకోయాక్టివ్ పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఈ నెట్ వర్క్ లోని ఒక మహిళతో సహా వివిధ దేశాలకు చెందిన అనేక మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 32 లీటర్ల CBD ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు BD 100,000 ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని, కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు తెలిపారు. 

యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల ప్రమాదాల నుండి సమాజాన్ని రక్షించడంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించమని పౌరులు , నివాసితులను కోరింది. ఇమెయిల్ ద్వారా @interior.gov.bh లేదా రహస్య హాట్‌లైన్ 996 ద్వారా సమాచారం తెలపాలని, వివరాలు గోప్యం పెడతామని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com