వాఫ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు సక్సెస్..!!
- December 02, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 29న వఫ్రాలో నిర్వహించిన కాన్సులర్ క్యాంపు విజయవంతమైందని ఎంబసీ తెలిపింది. వాఫ్రాలోని ఫైసల్ ఫామ్‌లో జరిగిన ఈ శిబిరానికి వఫ్రా ప్రాంతంలో నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయ పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీకి పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, లేబర్ ఫిర్యాదు నమోదు, పిసిసి , ఇతర ధృవీకరణ సేవలు వంటి సేవలను అందించారు. కాన్సులర్ క్యాంపు సందర్భంగా ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు.
భారతీయ రాయబార కార్యాలయం గతంలో అబ్దాలీలితోపాటు ఇతర మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ ప్రయోజనం కోసం అనేక కాన్సులర్ క్యాంపులను నిర్వహించింది. రాయబార కార్యాలయం ఎంబసీ వద్ద సాధారణ ఓపెన్ హౌస్ ను కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ భారతీయ కమ్యూనిటీ సభ్యులు రాయబారిని నేరుగా కలుసుకోవచ్చు. తమ సమస్యలకు పరిష్కారం నేరుగా పొందే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..