యూఏఈ జాతీయ దినోత్సవ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా..!!

- December 02, 2024 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా..!!

దుబాయ్: 53వ ఈద్ అల్ ఇత్తిహాద్‌ను ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, సురక్షితమైన పద్ధతిలో జరుపుకునేందుకు వీలుగా రూపొందించిన నియమాలు, మార్గదర్శకాలను అనుసరించాలని దుబాయ్ పోలీసులు కోరారు. భద్రతను పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ ను పెంచినట్లు తెలిపారు. ఈమేరకు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహారిస్తామని, డిక్రీ నెం. 30 ఆఫ్ 2023 ప్రకారం వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇక జప్తు చేయబడిన వాహనాన్ని విడుదలకు గరిష్టంగా Dh50,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది.  

సెలబ్రేషన్స్ కోసం బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని కోరారు. రోడ్లపై పరేడ్ లు, సమావేశాలపై నిషేధం ఉందన్నారు.  అన్ని ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. పోలీసు అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలి. డ్రైవర్లు, ప్రయాణికులు స్ప్రేలను ఉపయోగించరాదు. వాహనాల ముందు, వెనుక లైసెన్సు ప్లేట్‌లు కనిపించకుండా అడ్డంకులు సృష్టించవద్దు. వాహనం రంగును మార్చడం లేదా విండ్‌స్క్రీన్‌కు రంగు వేయడం నేరం.

ఈద్ అల్ ఎతిహాద్ కోసం ప్రత్యేకంగా, అధికారిక మార్గదర్శకాలు , షరతులకు లోబడి ఉండాలని, కారుపై ఎలాంటి స్టిక్కర్లు, సంకేతాలు లేదా లోగోలను పెట్టవద్దని ప్రజలను హెచ్చరించారు.  అంతర్గత లేదా బాహ్య రహదారులపై విన్యాసాలు చేయడం, ట్రాఫిక్‌ను అడ్డుకోవడం చేయవద్దు. అధిక శబ్దాలు చేయడం, ఇతరులకు ఇబ్బందులను కలిగించే లైసెన్స్ లేని ఫీచర్‌ల హారన్ లను వినియోగించడంపై నిషేధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com