'కబాలి' తెలుగు పాటలు నేడు విడుదల..

- June 26, 2016 , by Maagulf
'కబాలి' తెలుగు పాటలు నేడు విడుదల..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ నటించిన 'కబాలి' విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. టీజర్‌తో మొదలుకొని ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వరకు పలు రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రెక్స్‌ సినిమాస్‌ ఆడిటోరియంలో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ సినిమాగా 'కబాలి' చరిత్రలో నిలిచిపోనుంది. 2వేల మందికిపైగా కూర్చునే సదుపాయం కలిగిన ఈ థియేటర్‌లో భారీ తెరపై సినిమా వీక్షణ చక్కని అనుభూతిని కలిగిస్తుందని, అందులోనూ తలైవర్‌ సినిమాను చూడడం అంటే పదింతలు రెట్టింపు సంతోషంగా ఉందని ఫ్రాన్స్‌లోని ఓ తమిళ సినీ అభిమాని పేర్కొన్నాడు. అధికారికంగా ప్రకటించక పోయినా జూలై 15న 'కబాలి' విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఒకరోజు ముందుగానే అంటే 14న రెక్స్‌ సినిమాస్‌లో ప్రీమియర్‌ ప్రదర్శన ఉంటుందని సమాచారం. ఈ ప్రీమియర్‌కు రజనీ హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 'కబాలి'పై భారీ అంచనాలున్న నేపథ్యంలో తాజా పరిమాణాలు ఆ అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే 'కబాలి' తెలుగు పాటలు నేడు విడుదల కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com