ప్రధాని మోదీ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్!
- December 04, 2024
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పుతిన్ భారత పర్యటన తేదీలను 2025 ప్రారంభంలో నిర్ణయిస్తారని తెలిపారు. “మా నాయకులకు సంవత్సరానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఒప్పందం కుదిరింది. ఈసారి మా వంతు” అని రష్యా దౌత్యవేత్త పేర్కొన్నారు.
“మేం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకున్నాం. భారత్ ఆహ్వానాన్ని సానుకూలంగా పరిశీలిస్తాం. వచ్చే ఏడాది ప్రారంభంలో పుతిన్ పర్యటన ఖరారు చేస్తాం. తాత్కాలిక తేదీలను త్వరలోనే వెల్లడిస్తాం” అని యూరీ ఉషకోవ్ తెలిపారు.
అక్టోబర్ 2024లో కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా.. వచ్చే ఏడాది జరిగే 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి భారత్ సందర్శించాల్సిందిగా పుతిన్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం పంపారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ డొమైన్లలో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమగ్ర సమీక్షను నిర్వహించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.
జూలై 2024లో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మునుపటి సమావేశం తర్వాత ఇది ఈ ఏడాదిలో ఇదో రెండవ సమావేశంగా చెప్పవచ్చు. ఈ సమావేశంలో, పుతిన్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పీఎం మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్‌లో రష్యా నాయకత్వాన్ని, ప్రత్యేకించి అంకితభావాన్ని ఆయన అంగీకరించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం..”ఇద్దరు నేతలు రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. భారత్-రష్యా రాబోయే సమావేశాన్ని స్వాగతించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో తొలిసారిగా రాబోతున్నారు. భారత్ పర్యటన పుతిన్‌కు కీలకం కానుందని రష్యా రాయబార కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







