బంగ్లాదేశ్: జైలు నుంచి 700 మంది ఉగ్రవాదులు పరార్
- December 05, 2024బంగ్లాదేశ్: బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి.మరోవైపు, షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమ సమయంలో జైళ్లను బద్దలుకొట్టడంతో దేశవ్యాప్తంగా 2,200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పెద్ద ఎత్తున పరారయ్యారు.
వీరిలో కొందరిని ఆ తర్వాత పట్టుకోగా, ఇప్పటికీ 700 మంది ఆచూకీ తెలియరాలేదని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహ్మద్ మోతెర్ హోసైన్ తెలిపారు.ఈ ఏడాది జులై 19న జరిగిన అల్లర్ల సందర్భంగా రాజధాని ఢాకాలోని నార్సింగి జైలుపై వందలాది మంది దాడిచేసి నిప్పు పెట్టి అందులోని ఖైదీలను విడిపించారు.
తప్పించుకుపోయిన ఖైదీల్లో ఆ తర్వాత దాదాపు 1500మందిని తిరిగి అదుపులోకి తీసుకోగా, ఇంకా 700మంది ఆచూకీ లేదని, వారిలో 70 మంది ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్టు వివరించారు.వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నట్టు చెప్పారు. షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లిన తర్వాత బెయిలు పై బయటకు వచ్చిన ఉగ్రవాదులపై నిఘా కొనసాగుతున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!