యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలోకి ‘సెమ్సేమియా’..!!
- December 05, 2024
రియాద్: యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ రిప్రజెంటేటివ్ లిస్ట్‌లో సౌదీ అరేబియాకు చెందిన "క్రాఫ్టింగ్ అండ్ ప్లేయింగ్ ఆఫ్ ది సెమ్సేమియా ఇన్స్ట్రుమెంట్" చోటు సంపాదించింది. హెరిటేజ్ కమిషన్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈజిప్ట్ నేతృత్వంలోని నామినేషన్ ఫైల్ ద్వారా ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇప్పటికే యునెస్కో సాంస్కృతిక భాగాల జాబితాలో ఉన్న మజ్లిస్, అరబిక్ కాఫీ, సౌదీ అల్-అర్దా డ్యాన్స్, అల్-కత్ అల్-అసిరి, సకార్ (ఫాల్కన్రీ), ఖర్జూరం, అల్-సదు, సంప్రదాయ నేతపని, అరబిక్ కాలిగ్రఫీ, అల్హెదా, ఖవ్లానీ కాఫీ గింజలు, హరీస్ వంటకం సరసన సెమ్సేమియా చేరింది.
సేమ్సేమియా వాయిద్యం అనేది వివాహాలు, స్థానిక పండుగలలో వాయిస్తారు. మతపరమైన సమావేశాల సమయంలో కూడా ఈ వాయిద్యాన్ని ప్లే చేస్తారు. ఇక్కడ ప్రజలు సేమ్సేమియాతో కలిసి సాంప్రదాయ పాటలను పాడతారు. సేమ్సేమియా తీరప్రాంత కమ్యూనిటీల కళాత్మక వారసత్వంతో అనుబంధం కలిగి ఉంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







