మొదటిసారి $100,000 దాటిన బిట్ కాయిన్..!!
- December 05, 2024
యూఏఈ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనేపథ్యంలో క్రిప్టోకరెన్సీలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతో క్పిఫ్టోకరెన్సీ అయిన బిట్ కాయిన్ విలువ మొదటిసారి ఆరు అంకెల మార్కును దాటింది. బిట్‌కాయిన్ గురువారం మొదటిసారిగా $100,000 మార్కును అధిగమించింది. ఆసియా వాణిజ్యంలో $102,700 పలికింది. నవంబర్ 5న అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ గెలిచిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్‌ను "బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్"గా మార్చేందుకు కృషి చేస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ట్రంప్ గెలిచినప్పటి నుండి డిజిటల్ యూనిట్ 50 శాతానికి పైగా పెరిగింది. గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 134 శాతం పెరుగుదల నమోదైంది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







