డిసెంబర్ 13న జెమినిడ్ ఉల్కాపాతం..స్కైగేజర్‌లకు ఆహ్వానం..!!

- December 06, 2024 , by Maagulf
డిసెంబర్ 13న జెమినిడ్ ఉల్కాపాతం..స్కైగేజర్‌లకు ఆహ్వానం..!!

దోహా: 2024లో జెమినిడ్ ఉల్కాపాతం చూసేందుకు చివరి అవకాశం. నవంబర్ 19 నుండి జెమినిడ్‌లు ఆకాశంలో సందడి చేస్తుండగా, డిసెంబర్ 13 రాత్రి లెక్కలేనన్ని ఉల్కలు ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఇది స్కైగేజర్‌లకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని ఇవ్వనున్నాయి. 

జెమినిడ్స్ 3200 ఫేథాన్ అనే ఉల్క వల్ల ఏర్పడతాయి. భూమి ప్రతి సంవత్సరం ఫేథాన్ ధూళి పరిధిలో కదులుతున్నప్పుడు, మన వాతావరణంలోకి వచ్చే చిన్న ఉల్కలు మండిపోతాయని ఖగోళ ఫోటోగ్రాఫర్ మరియు ఎవరెస్టర్ అబ్జర్వేటరీ వ్యవస్థాపకుడు అజిత్ ఎవరెస్టర్ తెలిపారు. డిసెంబర్ 13న చంద్రుడు 96% నిండుగా వెలిగిపోతాడని,  ఈ సమయంలో ఉల్కలను కొద్దిగా  కష్టమైన, అల్ ఖర్రారా వద్ద నుండి ప్రకాశవంతమైన ఉల్కలు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయని తెలిపారు. 

 ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త, స్పేస్ క్లబ్ సహ వ్యవస్థాపకుడు నవీన్ ఆనంద్ మాట్లాడుతూ.. జెమినిడ్‌లను కంటితో ఆస్వాదించవచ్చని చెప్పారు: “జెమినిడ్ ఉల్కాపాతం సాధారణంగా ఖచ్చితమైన పరిస్థితులలో గంటకు 120 ఉల్కలను ఆకాశంలో చూడవచ్చు. కానీ ప్రకాశవంతమైన చంద్రుని కారణంగా ఈ సంవత్సరం గరిష్టంగా గంటకు 40 ఉల్కలు వస్తాయని అంచనా వేస్తున్నాము. ముఖ్యంగా చంద్రుడు అస్తమించే సమయంలో తెల్లవారుజామున 4 మరియు 5 గంటల మధ్య తక్కువ వ్యవధిలో 100 కంటే ఎక్కువ ఉల్కలను గుర్తించే అవకాశం ఉంటుంది.’’అని ఆనంద్ పేర్కొన్నాడు. ఆసక్తి ఉన్నవారి కోసం ఎవరెస్టర్ అబ్జర్వేటరీ భాగస్వామ్యంతో స్పేస్ క్లబ్  డిసెంబర్ 13న అల్ ఖర్రారాలో ఒక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈవెంట్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.   ఈవెంట్‌లో చేరడానికి, ఆసక్తిగల పాల్గొనేవారు అజిత్ ఎవరెస్టర్ లేదా నవీన్ ఆనంద్‌ని వాట్సాప్ ద్వారా 55482045 మరియు 30889582లో సంప్రదించవచ్చని లేదా ఖతార్ ఆస్ట్రానమీ, స్పేస్ క్లబ్ వెబ్‌సైట్‌లో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com