బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!

- December 06, 2024 , by Maagulf
బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!

మనామా: బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024 వేడుకల్లో భాగంగా ఈ డిసెంబర్‌లో కింగ్‌డమ్ ఆఫ్ బహ్రెయిన్ 12 లగ్జరీ క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం పలుకనున్నట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సారా అహ్మద్ బుహేజీ ప్రకటించారు. సముద్ర పర్యాటకాన్ని పెంపొందించడానికి, జాతీయ పర్యాటక వ్యూహం 2022-2026లో పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి బహ్రెయిన్ కొనసాగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 

ఇటువంటి వైవిధ్యమైన క్రూయిజ్ షిప్‌లను స్వాగతించడం బహ్రెయిన్ ప్రముఖ ప్రాంతీయ పర్యాటక గమ్యస్థానంగా హైలైట్ అవుతుందని బుహేజీ అన్నారు. గ్రీక్ నౌక "సెలెస్టైల్ జర్నీ", గల్ఫ్‌లో అరంగేట్రం చేసిందని, ఫ్రెంచ్ క్రూయిజ్ షిప్ "లే బౌగెన్‌విల్లే", జర్మన్ AIDA ఫ్లీట్, స్విస్-ఇటాలియన్ MSC క్రూయిజ్‌లు త్వరలో రానున్నట్లు పేర్కొన్నారు. 

ఈ క్రూయిజ్ షిప్ సందర్శనలు పర్యాటకులకు బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024 కార్యకలాపాలను ఆస్వాదించడానికి, శీతాకాలపు బీచ్ టూరిజంను ఎంజాయ్ చేసేందుకు, అదే సమయంలో బహ్రెయిన్ శక్తివంతమైన మార్కెట్లు, మాల్స్, వారసత్వ ప్రదేశాలు, పురావస్తు ప్రదేశాలను చూసేందుకు అవకాశం కల్పిస్తాయని బుహెజీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com