'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- December 06, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ తన మొదటి ప్రయోగాత్మక రాకెట్ "దుక్మ్-1" ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ చారిత్రాత్మక సంఘటనను రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) పర్యవేక్షణలో నేషనల్ స్పేస్ సర్వీసెస్ కంపెనీ (NASCOM) అనుబంధ సంస్థ అయిన ఎడాఖ్ నిర్వహించింది. ఈ ప్రయోగం ఒమన్ తన అంతరిక్ష రంగాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లిందన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:05 గంటలకు 18°N, 56°E, విలాయత్ ఆఫ్ డుక్మ్‌కు దక్షిణంగా కోఆర్డినేట్‌ల నుండి రాకెట్ ను ప్రయోగించారు. MTCITలో కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ సెక్రటరీ అలీ బిన్ అమెర్ అల్-షెజానీ మాట్లాడుతూ.. విజయవంతమైన ప్రయోగం ప్రపంచ అంతరిక్ష రంగ మ్యాప్‌లో ఒమన్‌ను చేర్చిందని హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష సంబంధిత పెట్టుబడులు, కార్యకలాపాల కోసం ఒమన్ అంతర్జాతీయ పెట్టుబడిదారులను, అంతరిక్ష సంస్థలను ఇది ఆకర్షిస్తుందని చెప్పారు. ఈ ప్రయోగం ఒమన్‌లో ప్రత్యేక స్పేస్‌పోర్ట్‌ను స్థాపించడానికి మార్గం సుగమం చేస్తుందని అల్-షెజానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నాస్కామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ హిస్ హైనెస్ సయ్యద్ అజాన్ బిన్ కైస్ అల్ సయీద్.. మిషన్ విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఈ చారిత్రాత్మక సంఘటన గురించి మేము గర్విస్తున్నాము. మొదటి నుండి, మా దృష్టిలో ఒమన్‌ను అగ్రగామిగా నిలబెట్టడం. మధ్యప్రాచ్యంలో అంతరిక్ష అన్వేషణ, ఈ ప్రాంత మొదటి స్పేస్‌పోర్ట్‌ను స్థాపించడం ద్వారా మేము వారి అమూల్యమైనందుకు MTCITకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒమన్ అంతరిక్ష రంగాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు ఇది కీలకపాత్ర పోషించింది.’’ అని అన్నారు. ఈ విజయవంతమైన ప్రయోగం దాని అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒమన్ యొక్క నిరంతర ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ హెడ్ సౌద్ బిన్ హమీద్ అల్-షుయైలీ తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







