చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!

- December 06, 2024 , by Maagulf
చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!

రియాద్: సౌదీ అరేబియా, మరో ఏడు ఒపెక్ దేశాలు తమ చమురు ఉత్పత్తి కోతను మార్చి 2025 చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలు గతంలో అదనపు స్వచ్ఛంద సర్దుబాట్లను ప్రకటించాయి. 38వ ఒపెక్, నాన్-ఒపెక్‌ దేశాలు వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాయి.  ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు ప్రకటించారు.

ఈ దేశాలు తమ అదనపు స్వచ్ఛంద సర్దుబాట్లను రోజుకు 2.2 మిలియన్ బ్యారెల్స్‌ కోతను నవంబర్ 2023లో ప్రకటించారు. మార్చి 2025 తర్వాత క్రమంగా నెలవారీ ప్రాతిపదికన సర్దుబాట్లను తగ్గిస్తూ,  సెప్టెంబర్ 2026 వరకు పూర్తిగా నిలిపివేయనున్నారు. ఆ తర్వాత ఉండే మార్కెట్ పరిస్థితులకు లోబడి పాజ్ చేయవచ్చు లేదా రివర్స్ చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపాయి.

చమురు మార్కెట్ల స్థిరత్వం మరియు సమతుల్యతను కాపాడే లక్ష్యంతో OPEC+ దేశాల ముందుజాగ్రత్త ప్రయత్నాలను బలోపేతం చేయడానికి వర్చువల్ సమావేశం నిర్వహించాయి. ఏప్రిల్ 2023లో ప్రకటించిన రోజుకు 1.65 మిలియన్ బారెల్స్ అదనపు స్వచ్ఛంద సర్దుబాట్లను డిసెంబర్ 2026 చివరి వరకు పొడిగించాలని ఈ దేశాలు  నిర్ణయించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com