విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- December 06, 2024
- 11,009 కోట్లతో నిర్మాణం.
- 66.15 కిలోమీటర్ల నిడివితో మెట్రో రైల్ ప్రాజెక్టు.
- మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు.
- రెండవ ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు
- మొదటి ఫేజ్ లో 1152 కోట్లతో భూసేకరణ..
అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం 66.15 కిలోమీటర్ల నిడివితో రెండు దశల్లో నిర్మించబడుతుంది. మొదటి దశలో 38.4 కిలోమీటర్లు, రెండవ దశలో 27.75 కిలోమీటర్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబందించిన ప్రారంభం మరియు నిర్మాణం లాంటి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ, ప్రాజెక్టు ప్రారంభం త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో రెండు కారిడార్లు రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు.
ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో రెండు కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొదటి దశలో కారిడార్ 1ఏ, 1బిలను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. దీనికి రూ.11,009 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మొదటి దశ కారిడార్ 1ఏ, 1బిల భూసేకరణకు రూ.1152 కోట్ల వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. రెండో దశలో నిర్మించే మూడో కారిడార్‌ను 27.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం, ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు విజయవాడ నగరానికి మెట్రో రైలు సౌకర్యం అందించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే, విజయవాడ నగరానికి మెట్రో రైలు సౌకర్యం అందించడం ద్వారా నగర అభివృద్ధికి తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..