అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు

- December 06, 2024 , by Maagulf
అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు

హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల పై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన అభిమానులను ‘అల్లు ఆర్మీ’ అని పిలవడం కొంతమందికి అభ్యంతరం కలిగించింది. ‘ఆర్మీ’ అనే పదం దేశ రక్షణ దళాలకు సంబంధించినది కాబట్టి దానిని అభిమానులకు వాడకూడదని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల దేశ రక్షణ దళాల గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఇది చట్టవిరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను విచారించేందుకు సమన్లు జారీ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందిస్తూ, తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం ద్వారా వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో మాత్రమే చేశానని ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం లేదని తెలిపారు.ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com