ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయంగా ‘జాయెద్ విమానాశ్రయం’..!!

- December 06, 2024 , by Maagulf
ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయంగా ‘జాయెద్ విమానాశ్రయం’..!!

యూఏఈ: అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మక ప్రిక్స్ వెర్సైల్లెస్, ది వరల్డ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ అవార్డ్‌లో ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయంగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ విభాగంలో అత్యుత్తమ నిర్మాణ డిజైన్‌ గా గుర్తింపు పొందింది.  విమానాశ్రయం మొదటి వార్షికోత్సవం, 53వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్యారిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు.  కేవలం ఒక సంవత్సరం ఆపరేషన్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్ ఎక్సలెన్స్‌కి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి, బలమైన ప్రపంచ పోటీ మధ్య జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ అత్యంత గౌరవనీయమైన విభాగంలో అగ్రస్థానాన్ని పొందిందని అబుదాబి ఎయిర్‌పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లి తెలిపారు.

యూఏఈ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేసిన జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అద్భుతమైన డిజైన్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 742,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక విలక్షణమైన X- ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది. గంటకు 11,000 మంది ప్రయాణికులు, ఏకకాలంలో 79 విమానాలు ప్రయాణించేందుకు వీలుగా దీనిని నిర్మించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com