హీటింగ్ పరికరాల వినియోగంపై సివిల్ ఢిపెన్స్ హెచ్చరికలు..!!
- December 07, 2024
రియాద్: ప్రస్తుత చలికాలంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఈ సమయంలో హీటింగ్ పరికరాలను ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వాటిని ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రజలను హెచ్చరించింది. హీటింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా విధానాలను అనుసరించడం చాలా ముఖ్యమని తెలిపింది. పిల్లలు వాటి వద్దకు రాకుండా జాగ్రత్తులు తీసుకోవాలని గుర్తుచేసింది. హీటింగ్ పరికరాలను రూములలో వినియోగించే సమయంలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని, అలాగే బయటకు వెళ్లేటప్పుడు లేదా నిద్రిస్తున్నప్పుడు హీటర్‌ను ఆఫ్ చేయాలని, ఆహారం మరియు పానీయాలను వేడి చేయడానికి ముందు కర్టెన్‌లు, ఫర్నిచర్, వంటి వాటికి దూరంగా పెట్టాలని డైరెక్టరేట్ తెలిపింది. ఏదైనా అత్యవసర సందర్భంలో రియాద్, మక్కా, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 ఫోన్ నంబర్‌లో.. మిగిలిన ప్రాంతాలలో 998 నంబర్‌లో సివిల్ డిఫెన్స్‌ను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







