దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!
- December 07, 2024
దుబాయ్: దుబాయ్ లో జనవరి 1, 2025 నుండి ఆల్కహాల్‌పై 30 శాతం పన్నును పునరుద్ధరించింది. ఈ మేరకు మార్పుల గురించి ఆల్కహాల్ రిటైలర్ ఆఫ్రికన్ + ఈస్టర్న్ రెస్టారెంట్లు, బార్లకు ఇమెయిల్‌లో తెలియజేశారు.మద్య పానీయాల కొనుగోళ్లపై 30 శాతం మునిసిపాలిటీ పన్నును జనవరి 2025 నుండి పునరుద్ధరించబడుతుందని దుబాయ్ ప్రభుత్వం తమకు తెలియజేసిందని మెజెస్టిక్ రిట్రీట్ సిటీ హోటల్ మరియు పర్మిట్ రూమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎటి భాసిన్ వెల్లడించారు.జనవరి 1, 2025 నుండి అన్ని ఆర్డర్లపై ఈ మేరకు ప్రభావం చూపుతుందన్నారు.జనవరి 2023లో దుబాయ్ మునిసిపాలిటీ ఎమిరేట్‌లో ఆల్కహాల్ అమ్మకాల పై 30 శాతం పన్నును ఒక సంవత్సరం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం దానిని డిసెంబర్ 2024 చివరి వరకు పొడిగించారు.
తాజా వార్తలు
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో







