అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్..!
- December 13, 2024
సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు.
డిసెంబర్ 4న ‘పుష్ప2’ ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ అల్లు అర్జున్ రావడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తరువాత గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







