యూఏఈలో 12°C కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు..!!
- December 13, 2024
యూఏఈ: యుఎఇలో ఉష్ణోగ్రతలు రాబోయే వారాల్లో 12°C వరకు తగ్గుతాయని. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. వాతావరణశాఖ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ.. డిసెంబర్ 16 నుండి చల్లటి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. దీంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. ఫలితంగా యూఏఈ అంతటా ఉష్ణోగ్రతలు 5-7°C తగ్గుతాయని, చల్లని గాలులు పశ్చిమ ప్రాంతాలలో ప్రారంభమై క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తుందని వెల్లడించింది. పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు రెడ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేయనున్నారు. అల్ ఐన్ వంటి తూర్పు ప్రాంతాలు, రస్ అల్ ఖైమా వంటి ఉత్తర ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
శీతాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
యూఏఈలో శీతాకాలం అధికారికంగా డిసెంబర్ 22న ప్రారంభమవుతుంది. గత 30 ఏళ్లలో, దేశంలో అత్యంత చలి కాలం జనవరి 16 నుండి 18 వరకు ఉంది. సాంప్రదాయ అరేబియా గల్ఫ్ క్యాలెండర్ ప్రకారం, శీతాకాలం రెండు ప్రధాన కాలాలుగా విభజించారు. "అర్బా ఇన్ అల్ మెరీ", "అర్బా ఇన్ అల్ అక్రాబి". ప్రతి ఒక్కటి 40 రోజులపాటు ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







