అల్లు అర్జున్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..
- December 13, 2024
సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని బన్నీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదానలు విన్న న్యాయస్థానం బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నాం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదని, సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) న్యాయస్థానాన్ని కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







