అల్లు అర్జున్‌కు ఊర‌ట‌.. మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..

- December 13, 2024 , by Maagulf
అల్లు అర్జున్‌కు ఊర‌ట‌.. మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..

సినీ న‌టుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊర‌ట ల‌భించింది. న్యాయ‌స్థానం మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో త‌న‌పై న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని బ‌న్నీ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగాయి. వాదాన‌లు విన్న న్యాయ‌స్థానం బ‌న్నీకి మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా పోలీసులు పేర్కొన్నారు. మ‌ధ్యాహ్నాం 1.30కి అరెస్టు చేసిన‌ట్లు రిమాండ్ రిపోర్టులో వెల్ల‌డించారు.

క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదని, సోమవారం వినాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) న్యాయ‌స్థానాన్ని కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com