'నాయకి' చిత్రం జులై 8న విడుదల..

- June 27, 2016 , by Maagulf
'నాయకి' చిత్రం జులై 8న విడుదల..

త్రిష ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న 'నాయకి' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా జులై 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దర్శకుడు గొవి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. త్వరలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నట్లు ట్వీట్‌ చేశారు.
తొలిసారి మహిళా పాత్ర ప్రధానంగా గల హారర్‌ చిత్రంలో త్రిష నటించింది. ఈ చిత్రానికి గిరిధర్‌ మామిడిపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం సమకూర్చారు. సుష్మారాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌, బ్రహ్మానందం, కోవై సరళ, సత్యం రాజేశ్‌, మనోబాల తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com