అన్‌ ఇస్లామిక్‌ డ్రస్సింగ్‌ : 50 మంది అరెస్ట్‌

- June 27, 2016 , by Maagulf
అన్‌ ఇస్లామిక్‌ డ్రస్సింగ్‌ : 50 మంది అరెస్ట్‌

సౌదీ అరేబియాలో 50 మందిని అరెస్ట్‌ చేశారు, పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా 'అన్‌ ఇస్లామిక్‌ డ్రస్సింగ్‌'తో పాల్పడ్డారని. సపవిత్ర మక్కా సిటీలో, ఇస్లామ్‌ పవిత్ర స్థలంలో వీరిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తుంది. వెరైటీ హెయిర్‌ కట్స్‌, చెయిన్స్‌ ధరించడం, హెడ్‌ వ్రాప్స్‌, అలాగే షార్ట్‌ క్లాత్స్‌ వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున వీరిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయినారిలో మహిళలు కూడా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా వీరంతా వ్యవహరిస్తూ, షాపింగ్‌ చేస్తుండగా పోలీసులు వారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పొరపాటు జరిగిందంటూ అరెస్టయిన ఓ వ్యక్తి తన తప్పుని అంగీకరించినట్లు తెలియవస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com