రోడ్డు ప్రమాదంలో దుబాయ్‌ వలసదారుడి మృతి

- June 27, 2016 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో దుబాయ్‌ వలసదారుడి మృతి

దుబాయ్‌కి చెందిన వీడియో గేమింగ్‌ ఇండస్ట్రీ ప్రొఫెషనల్‌, కారు ప్రమాదంలో మృతి చెందాడు. రస్‌ అల్‌ ఖైమాలోని జబెల్‌ అల్‌ జైస్‌లోగల మౌంటెయిన్‌ రోడ్‌లో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టర్కీకి చెందిన ఎర్గన్‌ గుండోగార్‌ స్నేహితులతో సరదాగా గడిపి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అల్‌ పత్తైమ్‌ ఎలక్ట్రానిక్స్‌లో గుండోగార్‌ ప్రోడక్ట్‌ మరియు మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గేమింగ్‌ ప్రోడక్ట్స్‌కి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకుని, సివిల్‌ డిఫెన&్స టీమ్‌ అక్కడికి చేరుకుంది. అయితే, ప్రమాద తీవ్రతతో గుండోగర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. గోండోగార్‌కి వీడియోగేమ్స్‌ ఆడటంతోపాటు, వేగంగా కార్లు నడపడం ఇష్టమనీ, రేసింగ్‌ని బాగా ఇష్టపడతాడనీ సన్నిహితులు తెలిపారు. గుండోగర్‌ భౌతిక కాయాన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి కుటుంబ సభ్యులకు భౌతిక కాయాన్ని అప్పగిస్తారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, మౌంటెయిన్స్‌లో ప్రయాణించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలని లెఫ్టినెంట్‌ కల్నల్‌ అల్‌ షాల్‌ సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com