రెడ్, గ్రీన్ లైన్లలో రియాద్ మెట్రో కార్యకలాపాలు ప్రారంభం..!!
- December 16, 2024
రియాద్: రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) రియాద్ మెట్రో మరో రెండు లైన్ల ఆపరేషన్ ను ప్రారంభించింది. లైన్ 2 (రెడ్ లైన్), లైన్ 5 (గ్రీన్ లైన్) ద్వారా మొత్తంగా రియాద్ మెట్రో ఆరు లైన్లలో ఐదింటిలో అందుబాటులోకి వచ్చినట్టయింది. ఆదివారం ఉదయం 6:00 గంటలకు ప్రారంభమయ్యే రెండు లైన్‌ల స్టేషన్‌లలో ప్రయాణికులను స్వాగతం పలికారు.
కింగ్ ఫహద్ స్పోర్ట్స్ సిటీ, కింగ్ సౌద్ యూనివర్శిటీని కలుపుతూ రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ గుండా 15 స్టేషన్ల మీదుగా కింగ్ అబ్దుల్లా రోడ్ మీదుగా రెడ్ లైన్ 25.1 కి.మీ పొడవునా రియాద్ తూర్పు నుండి పశ్చిమానికి విస్తరించి ఉందని RCRC ఒక ప్రకటనలో తెలిపింది. STC స్టేషన్ వద్ద బ్లూ లైన్‌తో.. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేషన్‌లోని గ్రీన్ లైన్‌తో, అల్-హమ్రా స్టేషన్‌లో పర్పుల్ లైన్‌తో కలుపుతుంది.
రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖతో సహా అనేక మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలకు సేవలందించడానికి గ్రీన్ లైన్ 13.3 కి.మీ. మేర విద్యా మంత్రిత్వ శాఖ పక్కన ఉన్న కింగ్ అబ్దుల్లా రోడ్ నుండి నేషనల్ మ్యూజియం వరకు విస్తరించి ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. 12 స్టేషన్ల ద్వారా అనేక వాణిజ్య, నివాస సౌకర్యాలకు రవాణా సదుపాయాలను అందిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, నేషనల్ మ్యూజియం స్టేషన్‌లు మినహా లైన్‌లోని అన్ని స్టేషన్‌లు ఆదివారం సేవలు అందుబాటులోకి చవ్చాయి. గ్రీన్ లైన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేషన్‌లో రెడ్ లైన్‌తో. నేషనల్ మ్యూజియం స్టేషన్‌లో బ్లూ లైన్‌తో కలుస్తుంది. జనవరి 5, 2025న లైన్ 3 (ఆరెంజ్ లైన్) మదీనా రోడ్ లో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రియాద్ మెట్రో.. మధ్యప్రాచ్యంలో అతిపెద్దది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవర్‌లేని రైలుగా గుర్తింపుపొందింది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ నవంబర్ 21 న మెట్రో సేవలను ప్రారంభించారు.
రియాద్ మెట్రో ప్రాజెక్ట్ ఆరు ప్రధాన లైన్ల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 176 కిలోమీటర్లు విస్తరించి 4 ప్రధాన స్టేషన్‌లతో సహా 85 స్టేషన్‌లను కలుపుతుంది. ప్రయాణీకులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) అందించిన Darb అప్లికేషన్ ద్వారా లేదా నేరుగా మెట్రో స్టేషన్‌లలో టిక్కెట్ విండోలు, వెండింగ్ మెషీన్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. రైలు సేవ గురించి మరిన్ని వివరాలను 19933 నంబర్‌లో కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు