MBR ఏరోస్పేస్ హబ్‌లో ప్రైవేట్ జెట్ ట్రాఫిక్..18వేల విమానాలకు చేరువ..!!

- December 16, 2024 , by Maagulf
MBR ఏరోస్పేస్ హబ్‌లో ప్రైవేట్ జెట్ ట్రాఫిక్..18వేల విమానాలకు చేరువ..!!

యూఏఈ: మహ్మద్ బిన్ రషీద్ ఏరోస్పేస్ హబ్‌లో 2024 చివరి నాటికి ప్రైవేట్ జెట్ ట్రాఫిక్ 18వేల విమానాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. యూఏఈ కొత్త సౌకర్యాలు, సాంకేతికతతో గ్లోబల్ ప్రైవేట్ ఏవియేషన్ హబ్‌గా మారుతుందని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) తెలిపింది. దుబాయ్‌లోని మొహమ్మద్ బిన్ రషీద్ ఏరోస్పేస్ హబ్‌లో ఉన్న ఫాల్కన్ టెక్నిక్ కొత్త 13,705 sqm MRO సౌకర్యం, Airbus A380 వంటి పెద్ద మోడళ్లతో సహా అనేక రకాల విమానాల సేవలను అందించడానికి రూపొందించిన అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది.

ప్రైవేట్ లాంజ్‌లు, అధునాతన వర్క్‌షాప్‌లు, అంతర్గత డిజైన్ స్టూడియో, ప్రీమియం మెయింటెనెన్స్ సామర్థ్యాలతో కూడిన VIP ఎయిర్‌క్రాఫ్ట్ లకు సేవలను అందిస్తున్నారు. ఫాల్కన్ టెక్నిక్ తన ఆమోదాలను విస్తరించడంతో పాటు ఇంటీరియర్స్, వీల్స్, బ్రేక్‌లు, నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (NDT), బ్యాటరీలు, ఎయిర్‌క్రాఫ్ట్ పెయింటింగ్ కోసం ప్రత్యేకమైన సేవలను అందిస్తున్నారు.

"ప్రైవేట్ ఏవియేషన్‌లో అగ్రగామిగా ఉండాలనే దుబాయ్ దృష్టితో ఫాల్కన్ టెక్నిక్ MRO సదుపాయం ఉంది. ఈ అత్యాధునిక మౌలిక సదుపాయాలు వినూత్న సేవలను అందించడంలో, విమానయాన నైపుణ్యానికి కేంద్రంగా యూఏఈ పాత్రను బలోపేతం చేయడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది." అని మహమ్మద్ బిన్ రషీద్ ఏరోస్పేస్ హబ్ సీఈఓ తహ్నూన్ సైఫ్ తెలిపారు. మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా బిజినెస్ ఏవియేషన్ అసోసియేషన్ (MEBAA) షో 2024లో ఈ కీలక మైలురాయిని ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com