క్రెడిట్ కార్డ్ స్కామ్‌.. ఖాతాదారులకు బ్యాంకు డబ్బులు చెల్లిస్తుందా?

- December 16, 2024 , by Maagulf
క్రెడిట్ కార్డ్ స్కామ్‌.. ఖాతాదారులకు బ్యాంకు డబ్బులు చెల్లిస్తుందా?

యూఏఈ: ఇటీవల బ్యాంకింగ్ స్కామ్‌లో డబ్బు పోగొట్టుకోవడం సాధారణంగా మారింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కస్టమర్లు పోగొట్టుకున్న డబ్బును తిరిగి చెల్లించేందుకు బ్యాంకు బాధ్యత వహిస్తుందా?  అంటే పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో  ఎవరైనా ఇ-చెల్లింపు లావాదేవీల అప్లికేషన్‌లు లేదా వెబ్‌సైట్‌లను హ్యాక్ చేస్తే అది నేరం. ఇది అటువంటి నేరానికి పాల్పడిన వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ద్వారా జైలు శిక్ష మరియు/లేదా జరిమానాల చెల్లింపుకు దారి తీయవచ్చు. ఇది ఫెడరల్ డిక్రీ లా నం.లోని ఆర్టికల్ 15 (2)కి అనుగుణంగా హ్యాకింగ్ ఇ-పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌, సైబర్ నేరాలను ఎదుర్కోవడం కోసం చట్టాలు ఉన్నాయి. “ఎవరైనా ఏదైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఏదైనా ఇ-పేమెంట్‌ను ఫోర్జరీ చేసినా, క్లోన్ చేసినా లేదా కాపీ చేసినా లేదా వాటిలో దేనినైనా ఉపయోగించి దాని డేటా లేదా సమాచారాన్ని క్యాప్చర్ చేసినా జైలు శిక్ష /లేదా Dh200,000 కంటే తక్కువ లేదా Dh2 మిలియన్ల కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు ఆశిష్ మెహతా తెలిపారు.  అయితే, యూఏఈలోని ఆర్థిక సంస్థలు ఆర్థిక నేరాలకు సంబంధించి తమ వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్థిక సంస్థల వినియోగదారుల రక్షణ నిబంధనలలోని నిబంధన 6.2.2.5 ప్రకారం ఆర్థిక సంస్థ తప్పనిసరిగా తాజా భద్రతా వ్యవస్థలను నిర్వహించాలి. అవసరమైన విధంగా కొత్త సైబర్ భద్రతా వ్యూహాలను అమలు చేయాలి.  

కాగా, ఆర్థిక నేరాల కారణంగా ఖాతాదారులకు ఏదైనా ఆర్థిక నష్టం జరిగినప్పుడు ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ఆర్థిక నేరాల కారణంగా ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహించవు.  అది వినియోగదారుల నిర్లక్ష్యం లేదా మోసపూరిత ప్రవర్తన కారణంగా చూపి తప్పించుకుంటాయి. ఇది ఆర్థిక సంస్థల వినియోగదారుల రక్షణ నిబంధనలలోని క్లాజ్ 6.2.2.4 ప్రకారం.. “లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలు ఆర్థిక నేరాలు, దుర్వినియోగం, సైబర్-దాడులు, దుర్వినియోగం వల్ల కలిగే ఆర్థిక నష్టాలు, ఖర్చుల కోసం వినియోగదారులకు సకాలంలో పరిహారం చెల్లించాలి. వినియోగదారుల నిర్లక్ష్యం లేదా మోసపూరిత ప్రవర్తన కారణంగా నష్టం జరిగిందని రుజువు చేయకపోతేనే." అని బ్యాకింగ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. చట్టంలోని నిబంధనల ఆధారంగా, సైబర్ క్రైమ్/స్కామ్ ఫలితంగా ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి బ్యాంక్ పరిహారం చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే, ఒకవేళ ఆ నష్టం వినియోగదారుల నిర్లక్ష్యం లేదా మోసపూరిత ప్రవర్తన వల్ల అయితే, కోల్పోయిన డబ్బును తిరిగి ఇచ్చే బాధ్యత బ్యాంకుకు ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వెబ్ సైట్ ను చూడవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com