సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాల పై వివరణ

- December 16, 2024 , by Maagulf
సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాల పై వివరణ

హైదరాబాద్: కొన్ని పత్రికల్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాలు మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటాయని తప్పుగా ప్రచురించడం జరిగింది.ఈ విషయం పై స్పష్టత ఇవ్వడం జరుగుతోంది.

సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ 24 గంటలూ, 7 రోజులు పనిచేస్తుంది.అందువల్ల ఎవరైనా సైబర్ నేరాలను నివేదించవచ్చు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చు.

కేసు స్థితి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ప్రత్యేకంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు.తద్వారా అధికారులు కేసుల దర్యాప్తు కోసం మరింత సమయం కేటాయించగలరు.

సైబర్ నేరాలు లేదా అత్యవసర సహాయం అవసరమైన వారు ఎప్పుడైనా సంప్రదించవచ్చు.

హెల్ప్‌లైన్ నెంబర్: 1930– 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

సైబర్ క్రైమ్ వెబ్‌సైట్: http://www.cybercrime.gov.in–ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం.

సైబర్ క్రైమ్ స్టేషన్ నెంబర్: 94906 17310–సహాయం కోసం.

ప్రజలందరూ ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.సైబర్ నేరాల నియంత్రణలో మీ సహకారం అవసరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com