భయాందోళనలు కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు.

- June 27, 2016 , by Maagulf
భయాందోళనలు కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు.

ఒమన్‌లో రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమైపోవడంతో వాటిని నివారించేందుకు రోడ్లను విస్తరించడం, రౌండ్‌ ఎబౌట్స్‌ని ఏర్పాటు చేయడమొక్కటే మార్గంగా కనిపిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారిక వర్గాలు వివరించాయి. తాత్కాలికంగా కొన్ని చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి&్సన అవసరం ఉందని ఒమన్‌ షురా కౌన్సిల్‌ మెంబర్‌ మొహమ్మద్‌ అల్‌ హిజ్రి చెప్పారు. 2015లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 675 మంది మృతి చెందారు. మొత్తం 6,276 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జులైలో అత్యధికంగా 51 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. 406 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెలలో 626 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనంతో పలు ప్రాజెక్టులు ముందుకు కదలలేకపోతున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com