జార్జియా: హోటల్ బెడ్రూమ్లో విగతజీవులుగా 12 మంది భారతీయులు
- December 16, 2024
జార్జియా: జార్జియాలోని గూడౌరి మౌంటైన్ రిసార్ట్‌లోని ఓ రెస్టారెంట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్లో కార్బన్ మోనాక్సైడ్ విడుదలై 12 మంది చనిపోయారు. చనిపోయిన 12 మందిలో 11 మంది భారతీయులేనని టిబిలిసిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రాథమిక పరీక్షలో చనిపోయినవారి శరీరాల పై గాయాలు ఏం లేవని జార్జియా దేశీయాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మృతులంతా అదే ఇండియన్ రెస్టారెంట్ ఉద్యోగులుగా గుర్తించారు.
బెడ్రూమ్ల దగ్గర ఉన్న పవర్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవ్వడం వల్లే వారంతా చనిపోయారని ప్రాథమిక నివేదికల్లో తెలిసింది.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు ఫోరెన్సిక్ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు