కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు షాక్‌ల‌మీద షాక్‌లు..మారుతున్న రాజకీయ లెక్కలు

- December 17, 2024 , by Maagulf
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు షాక్‌ల‌మీద షాక్‌లు..మారుతున్న రాజకీయ లెక్కలు

భారతదేశంపై అసత్య ప్రచారం చేస్తూ.. కయ్యానికి కాలుదువుతున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు వరుసగా షాక్‌ల‌మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీనుంచేకాక.. కెనడా దేశ ప్రజల నుంచి ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రూడోకు ఉప ప్రధాని క్రిస్టియా షాకిచ్చారు. ఈ దేశ ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రూడో కేబినెట్ లో అత్యంత శక్తిమంతురాలిగా ఆమెకు పేరుంది. ఆమె తమ పదవులకు రాజీనామా చేస్తూ జస్టిస్ ట్రూడోపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నాడని అన్నారు. ఈ క్రమంలో ట్రూడో కూడా తన ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తాజాగా ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ సైతం షాకిచ్చారు. ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ట్రూడో సర్కార్ పై అవిశ్వాస తీర్మానానికి సైతం ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కెనడాలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఇళ్లు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం, ట్రంప్ భారీ టారీఫ్ లు విధిస్తామని హెచ్చరించడంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగ్మీత్ సింగ్ పేర్కొన్నాడు. జగ్మీత్ సింగ్ కు తోడు ఆ దేశంలోని మెజార్టీ ప్రజల నుంచి ట్రూడో ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్ తీవ్రమవుతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. జగ్మీత్ సింగ్ ఖలిస్థానీ వేర్పాటు వాదానికి బలమైన మద్దతుదారు. వచ్చే ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగ్మీత్ సింగ్ ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ట్రూడో భారత్ పై అసత్యాలు ప్రచారం చేస్తూ విభేదాలను పెద్దవి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ట్రూడోపై గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో ప్రభుత్వం కూలిపోకుండా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇచ్చింది. దీంతో అవిశ్వాస గండం నుంచి ట్రూడో గట్టెక్కగలిగాడు. అయితే, ప్రస్తుతం ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిగ్ షాక్ ఇవ్వడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com