డిసెంబర్ 21-22 తేదీల్లో కువైట్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- December 18, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 21వ తేదీ( శనివారం) రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కువైట్‌లో పర్యటించనున్నారు. కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబా.. ప్రధాని మోదీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి శ్రీ దీ కూడా తన పర్యటన సందర్భంగా కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 22 (ఆదివారం) నాడు కువైట్ ఉన్నతాధికారులతో ఆయన అధికారికంగా చర్చలు జరుపుతారు. కువైట్‌లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు.దాదాపు 43 ఏళ్ల విరామం తర్వాత ప్రధాని స్థాయి వ్యక్తి కువైట్ లో పర్యటిస్తున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ పర్యటించని ఏకైక జిసిసి సభ్య దేశం కువైట్. 1981లో కువైట్‌ను సందర్శించిన చివరి భారత ప్రధాని ఇందిరా గాంధీ.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్







